ఈఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందు మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య . ఇక ఇప్పుడు థాంక్యూ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమా విక్రమా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మనం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు అలానే టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దానికి తోడు ఇప్పటికే ఈసినిమా చూసిన రైటర్ బీవీఎస్ ప్రసాద్ ఈ మూవీ ఫైనల్ కట్ చాలా బాగుంది అని నాగచైతన్య చేసిన అభిరామ్ పాత్ర అతని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని ప్రశంసలు కరిపించాడు. దీంతో ఈసినిమాపై అంచనాలు ఇంకా పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. నాగచైతన్య డిఫరెంట్ షేడ్స్ లో తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక రాశీఖన్నా-చైతు కాంబినేషన్ కూడా క్యూట్ గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s raining love and gratitude this monsoon season♥️🙏🏻
Presenting #ThankYouTrailer
▶️https://t.co/QWb1i4FmCQ#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalvikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/XqXhwCWgjK
— Sri Venkateswara Creations (@SVC_official) July 12, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: