హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ స్వీయ దర్శకత్వంలో హీరో గా తెరకెక్కుతున్న “టైసన్” కన్నడ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. హోంబలే ఫిల్మ్స్ సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం విశేషం. తాజాగా “టైసన్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2″ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో “సలార్”మూవీ తెరకెక్కుతుంది. “సలార్”మూవీ తో పాటు “రాఘవేంద్రస్టోర్స్”, “కాంటారా”, “భగీరా”, “రిచర్డ్ ఆంటోని”, దర్శకులు పవన్ కుమార్ , సుధా కొంగర దర్శకత్వంలో రెండు మూవీస్ ను హోంబలే సంస్థ నిర్మిస్తుంది. “కె జి ఎఫ్ చాప్టర్ 3 “మూవీ కూడా అనౌన్స్ అయ్యింది. వరుసగా దక్షిణాది లో నాన్ స్టాప్ గా సినిమాలు నిర్మిస్తున్న హోంబలే సంస్థకు అధిపతి కిరంగదుర్.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: