గణేష్ బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Bellamkonda Ganesh Swathi Muthyam Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Swathi Muthyam,Swathi Muthyam Movie,Swathi Muthyam Telugu Movie,Swathi Muthyam Movie Release Date Fixed,Swathi Muthyam Movie Release Date Announced, Bellamkonda Ganesh Swathi Muthyam Movie latest Updates,Swathi Muthyam Movie Latest Updates,Swathi Muthyam Bellamkonda Ganesh Movie,Bellamkonda Ganesh Upcoming Movie Swathi Muthyam, Bellamkonda Ganesh Upcoming Movie Swathi Muthyam,Bellamkonda Ganesh Movie Updates,Bellamkonda Ganesh Next Project

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ లలో బెల్లంకొండ సురేష్ కూడా ఒకరని చెప్పొచ్చు. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు బెల్లంకొండ సురేష్. ఇక బెల్లంకొండ సురేష్ వారసత్వంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా చాలా లేట్ అయింది. అయితే ఈమధ్యే మళ్లీ ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను ఆగష్ట్ 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + seven =