‘మేజర్’ నాకు సినిమా కాదు..ఒక ఎమోషన్ ..!

Major is not just a film its an emotion says adivi sesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major latest Movie Updates,Major Latest Collections Updates,Adivi Sesh Major Movie Updates,Adivi Sesh upcoming Movie Latest Updates, Adivi Sesh Emotional About Major Movie,Adivi Sesh Say Major Movie not jut Film Its an Emotion,Adivi Sesh Latest Blockbuster Movie Major,Major Movie Collections,Major Movie Box Office Collections, Adivi Sesh Latest Blockbuster Movie Major

వర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో ”ఇండియా లవ్స్ మేజర్ ‘ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పొయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మ్రోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపొయింది. కొత్త ఫోన్ కొనుక్కువాల్సివస్తుంది. ఎమోషనల్ గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. మేజర్ సందీప్ విషయానికి వస్తే ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన వుంది. నా గత చిత్రం ‘ఎవరు’ కంటే ఐదు రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ వున్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి. ఐతే మేజర్ ని నేను సినిమాగా చూడటం లేదు ఇది ఎమోషన్. ఇదే సంగతి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ కాబోతుందని ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లో చెబుతున్నా.

నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ పేరెంట్స్ ని మిస్ అవుతున్నా. అలాగే మా గురువు గారు అబ్బూరి రవి గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ చిత్రానికి గ్రేట్ గైడ్ అబ్బూరి రవి గారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీంకి కృతజ్ఞతలు. ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన పనికంటే పది రెట్లు ఎక్కువ చేశారు. అలాగే కాస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి స్పెషల్ థ్యాంక్స్.
మేజర్ సినిమా చూసిన చాలా మంది ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని వుందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై మేజర్ ప్రామిస్ చేస్తున్నా. సీడీఎస్, ఎన్డీఏ లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోతున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడిస్తాం. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్ ని లాంచ్ చేస్తాం. మేజర్ చిత్రాన్ని మా పేరెంట్స్ కి డెడికేట్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని మరింత పెద్ద విజయం చేయాలని కోరుతున్నా.’ అన్నారు అడవి శేష్

దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. మేజర్ అడివి శేష్ డ్రీం ప్రాజెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. ఐతే మేజర్ ని నన్ను డైరెక్ట్ చేయమన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. మేజర్ సందీప్ రియల్ హీరో అని తెలుసు. ఐతే ఆయన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో చూడటం తప్పితే ఆయన గురించి డీప్ గా అప్పటికి తెలీదు. ఐతే నాటీం ని ఏర్పాటు చేసుకొని సందీప్ గురించి ఒకొక్క విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాం. నా డైరెక్షన్ టీం వినయ్, రాజీవ్ ఎప్పుడూ నా పక్కనే వున్నారు. గౌతమ్ వీఎఫ్ ఎక్స్ అంతా తానే చూసుకున్నాడు. దినేష్ , అనురాగ్, మనోజ్ కూడా అద్భుతంగా పని చేశారు. సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు అద్భుతమైన విజువల్స్ అందించారు. నా మనసులో వున్న విజువల్స్ ని ప్రజంట్ చేశారు. అవినాష్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు. తాజ్ హోటల్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. కస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి థ్యాంక్స్ . శోభితా, సాయీ అద్భుతంగా చేశారు. అడవి శేష్ కి స్పెషల్ థాంక్స్. మేజర్ లాంటి గొప్ప సినిమా చేసే అవకాశం ఇచ్చారు. రచయిత అబ్బూరి రవి గారి సపోర్ట్ ని కూడా మర్చిపోలేం.

మేజర్ సందీప్ పేరెంట్స్ తో ప్రయాణం మర్చిపోలేం. వాళ్ళు చెప్పిన ప్రతి మాటని నోట్ చేసుకున్నాం. సందీప్ ఫాదర్ నాతో ఒక మాట చెప్పారు. సందీప్ మాతోనే వున్నాడు. మాకు ప్రతి విషయాన్ని గైడ్ చేస్తుంటాడని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది నాకు అర్ధం కాలేదు. నేను మేజర్ షూటింగ్ లో వుండగా మా నాన్నగారు చనిపోయారు. శేష్ కి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు సినిమా షూటింగ్ కు వెళ్ళు. ముందు సినిమాని పూర్తి చెయ్” అని మా నాన్న చెప్పినట్లనిపించింది. అప్పుడు మేజర్ సందీప్ నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి. మూడు రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ కి వచ్చేశాను.

ప్రకాష్ రాజ్ గారిని ఈ సీన్ లో చూస్తే మా నాన్న గుర్తుకు వచ్చారని, రేవతి గారిని చూస్తే అమ్మ గుర్తుకు వచ్చిందని చాలా మంది నాకు మెసేజులు పెడుతున్నారు. నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. కొందరు చాటుగా ఏడుస్తున్నామని చెబుతున్నారు. కానీ చాటుగా ఏడవద్దు. గర్వంతో కన్నీళ్లు కార్చండి. మేజర్ సందీప్ గారిది గొప్ప జీవితం. ఆయన చాలా గొప్పగా బ్రతికారు” అన్నారు

హీరోయిన్ సయీ మంజ్రేకర్‌ మాట్లాడుతూ… మేజర్ చిత్రంలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా ప్యాషన్, డెడికేషన్, గౌరవంతో ఈ చిత్రం చేశాం. దేశ వ్యాప్తంగా మేజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందంగా వుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన అడివి శేష్, శశి కిరణ్, నిర్మాతలు శరత్, అనురాగ్, జీఎంబీ, సోనీ పిక్చర్స్ కి కృతజ్ఞతలు” తెలిపారు.

నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి సందీప్ గారు పై నుండి ప్రతిక్షణం మమ్మల్ని ముందుకు నడుపుతున్నారని అనిపించేది. మా మొదటి మేజర్ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. ఇంత గొప్ప చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆందోళన కూడా వుంది. ఈ విషయంలో అడివి శేష్ మా వెంట ఉంటారని భావిస్తున్నా. సినిమా నచ్చితే బావుందని అంటారు. కానీ మేజర్ కి స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేని అనుభూతి. అడివి శేష్ మమ్మల్ని ముందుండి నడిపించారు. మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఈ ప్రోసస్ అంతటిలో శేష్ వున్నారు. దర్శకుడు శశికి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయా. యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఈ రోజు మీకు తెరపై అంత అద్భుతంగా కనిపించింది. మేజర్ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేజర్ ని ప్రతి ఒక్కరూ తప్పక థియేటర్ లో చూడాలని కోరుతున్నా” అన్నారు

నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి వస్తున్న రెపాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాని చూసిన ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుకునే యూత్ మేజర్ చూసిన తర్వాత ఫోర్స్ లోకి వెళ్లాలని ప్రేరణ పొందడం మాకు ఎంతోఆనందాన్ని ఇస్తుంది. శరత్ వాళ్ళ అన్నయ్య కూడా ఫోర్స్ లో పని చేస్తారు. ఆయన లక్ష్య సినిమా చూసి ఫోర్స్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇప్పుడు మేజర్ సినిమా చూసి మళ్ళీ అదే ప్రేరణ వచ్చిందని చెప్పడం చాలా ఆనందంగా వుంది. నెక్స్ట్ జనరేష్ మేజర్ చూసి ఫోర్స్ ని కెరీర్ గా ఎంచుకోవడమే అన్నిటికంటే పెద్ద విజయమని భావిస్తున్నా. చిత్రంలో పని చేసిన యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు” అని తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తుంది. నా కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో కొందరు ఫోన్ చేసి .. సినిమా రోలింగ్ టైటిల్స్, లైట్స్ ఆన్ అయినప్పటికీ ఎవరూ సీట్ నుండి లేవడం లేదని చెప్పారు. ఇంత మంచి విజువల్స్ రావడానికి కారణమైన నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు.

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. మేజర్ చిత్ర నిర్మాతలకు, దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరో అడవి శేష్ కు కృతజ్ఞతలు. మేజర్ సందీప్ బయోపిక్ కు మ్యూజిక్ అందించడం గొప్ప అదృష్టం, గౌరవంగా భావిస్తున్నా. మూడేళ్ళు పాటు మేజర్ జర్నీ సాగింది. కరోనా లాంటి పాండమిక్ ని దాటొచ్చాం. దర్శకుడు శశి గారి ఫాదర్ చనిపోయిన మూడో రోజుకే శశి ఎంతో ధైర్యంగా సెట్స్ కి వచ్చారు. మా నాన్నగారి 11రోజు పూజ తర్వాత నేనూ మేజర్ టీజర్ మిక్సింగ్ కి వచ్చాను. మేజర్ విజయం మాకెంతో గర్వంగా వుంది. నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ గారికి ఈ చిత్రం గొప్ప నివాళి.” అన్నారు

నటుడు అనీష్ కురువిల్లా మాట్లాడుతూ.. మేజర్ లాంటి గొప్ప సినిమా తీసిన మహేష్ బాబుగారికి కృతజ్ఞతలు. హీరో అడవి శేష్ మేజర్ చిత్రాన్ని ఎంతో అంకిత భావంతో చేశారు, అది తెరపై కనిపించింది. సినిమా మొదలైనప్పటి నుండి తెరకి అతుక్కుపోయా. దర్శకుడు శశి కిరణ్ మేజర్ చిత్రాన్ని అద్భుతంగా తీశారు, మేజర్ సందీప్ కి ఘనమైన నివాళిగా నిలిపారు. మేజర్ టీం అద్భుతమైన టీమ్ వర్క్ తోనే ఇంత పెద్ద విజయం సాధ్యమైయింది. ఈ చిత్రంలో బాగం కావడం గర్వంగా వుంది.” అన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =