టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి మొదటినుండి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్మీ నేపథ్యంలో జనగణమన అనే సినిమా రానుంది. ఈసినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. అంతేకాదు ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా పూజాకు సెట్ లోకి వెల్ కమ్ చెప్పారు.
JGM SHOOT BEGINS 🎬
Welcoming @hegdepooja on Board ✨@TheDeverakonda – #PuriJagannadh #JGM 🇮🇳
WW Release on AUG 3rd 2023
@directorvamshi @PuriConnects #SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/mPPxgfCqny
— Charmme Kaur (@Charmmeofficial) June 4, 2022
ఇక ఈసినిమాను పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రూపుదిద్దుకోనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసేశారు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























