వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిలో భాగంగానే ఇప్పటికే ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఎంత చిత్రం అనే ఈ సెకండ్ సాంగ్ ను మే9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది. నాని నిద్రపోతున్నట్లు నటిస్తూ నజ్రియాపై తల ఉంచడానికి ప్రయత్నిస్తుండగా.. నజ్రియా ప్రేమగా నానిని చెంపపై చేయివేసి ఆపడం బ్యూటీఫుల్ గా వుంది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ప్లజంట్ గా వుంది.
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: