మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. ఇక గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో ఈసినిమాలో చూపించాడు. ఇక ఇటీవలే సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే కదా. గత ఏడాది సెప్టెంబరులో బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా సాయి తేజ్ తనకు అండగా నిలబడిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ‘హలో అందరికీ నమస్కారం.. గ్రాటిట్యూడ్, థ్యాంక్స్, ఫ్యామిలీ, హ్యాపీనెస్ ఇలా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముందుగా నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన సయ్యద్ అబ్దుల్ ఫరుఖ్‌కు థ్యాంక్స్. భయ్యా.. మీరు హాస్పిటల్‌లో జాయిన్ చేయడం వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. థ్యాంక్స్. మానవత్వం ఇంకా బతికి ఉందంటే దానికి నిలువెత్తు నిదర్శనం మీరే. థాంక్యూ సో మచ్. మెడికోవర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వాళ్లకు థ్యాంక్స్. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చరణ్, బన్నీ, వరుణ్, వైషు, ఉపాసన అందరూ నాకోసం నిలబడ్డారు. రెండో ఫ్యామిలీ.. నేను హాస్పిటల్‌లో ఉన్నాని తెలిసి వచ్చిన నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్, తోటీ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా అందరికీ థ్యాంక్స్. ఇక మూడో ఫ్యామిలీ. ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే ఓన్లీ నా ఫ్యాన్సే కాదు. అందరి హీరోల ఫ్యాన్స్. అందరూ ఎన్నో పూజాలు చేశారు. కాలి నడకతో మెట్లు ఎక్కారు. అన్నదానాలు చేశారు. అందరికీ థ్యాంక్స్ అంటూ వీడియోలో తెలిపాడు.
It’s feels eternally long being away from you and waiting to share my heart out with you.
▶️ https://t.co/AzGIhT8C65Thank you each & everyone for your Love, support and Warmth.
Raising more stronger with your blessings.
Love you all 🤗#ThankYouNote#ForNewBeginnings— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 26, 2022
ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: