హిట్స్, ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 22న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా.. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్లు డిఫరెంట్ గా ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు టీజర్ ట్రీట్ కు రెడీ అయ్యారు చిత్రబృందం. టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు టీమ్. ఈ నెల 28 న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Get Mesmerize with the Sizzling Chemistry of our KRISHNA and VRINDA 💝
TEASER of #KrishnaVrindaVihari 🎋
Dropping on March 28th! 😍@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth#KrishnaVrindaVihariOnApr22 pic.twitter.com/RDosi4pYs5
— Naga Shaurya (@IamNagashaurya) March 26, 2022
కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: