లేడీ గెటప్ లో విలక్షణ నటుడు ‘ఉపేంద్ర’

Upendras New Lady Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Hero Upendra,Actro Upendra,Versatile actor of Kannada Upendra,Upendra Movies,Upendra upcoming Movies,Upendra Latest Movies,Upendra Suprise look, Upendra In lady Getup,Upendra new Movie Home Minister,Home Minister Releasing On 1st April 2022,Upendra Shared pictures in social Media,Upendra Shared Interesting Pictures in Socila Meida, Upendra Shared Interesting Pictures in Twitter,The picture shows a muslim lady with her face covered,Upendra Confirmed thats it he,Upendra lady Getup picture Goes Viral In social Media, Kannada Star in lady Getup,Picture of Upendra is from Home Minister Movie,Upendra will be seen in a lady role in the film,Home Minister is written and directed by Sujay Srihari, Poorna Naidu produced the film under the banner of Sreeyas Chitra,Ghibran composed the music for the film,Vedika is the lead actress,Upendra in Varun Tej’s upcoming film Ghani, Upendra Role name Vijender Sinha in Ghani movie,Ghani Movie On April 8th,Ghani Movie Releasing on April 8th,#Upendra,#Homeminister

విభిన్నమైన సినిమాలతో.. డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ ను ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఇక ఇప్పుడు కూడా అలాంటి డిఫరెంట్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో తను తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటో షేర్ చేయగా మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు ఉపేంద్ర. ఒక అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్డడమే కాదు ఆ ఫొటో ను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కాదు ఉపేంద్రనే. ఆయ‌న లేడీ గెట‌ప్ ధరించి ఆ ఫొటో దిగార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న సినిమాలో ఓ పాత్ర కోసం ఇలా లేడీ గెట‌ప్ వేసి ఉంటార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఉపేంద్ర మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. సుజ‌య్ శ్రీ‌హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఉపేంద్ర హీరోగా హోం మినిస్టర్ అనే సినిమా వస్తుంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలుపెట్టారు కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా సినిమాలో ఉపేంద్ర‌కు జోడీగా వేదిక నటిస్తుంది. ఈసినిమాను పూర్ణ నాయుడు శ్రేయాస్ చిత్ర బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఘిబ్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఇంకా కబ్జ అనే సినిమా కూడా చేస్తున్నాడు ఉపేంద్ర. సుదీప్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముంగించుకునే పనిలో ఉంది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను కన్నడ , తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 12 =