ఇప్పటికే గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను కోల్పోయిన దేశం.. ఇప్పుడు మరో లెజెండరీ గాయనిని కోల్పోయింది. ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ తుది శ్వాస విచిచారు. కొద్ది రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంచి చికిత్స పొందారు. ఆతరువాత ఆమె కరోనా నుండి కోలుకున్నట్టు అటు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆరోగ్యం కాస్త క్షీణించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఆమె అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ప్రముఖులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకగా.. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1929 సెప్టెంబర్ 28న జన్మించిన లతా మంగేష్కర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మొదట 1942లో సినీ రంగంలో ప్రవేశించిన లతా మంగేష్కర్ మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా గాయనిగానే తన కెరీర్ ను మార్చేసుకున్నారు. గాయనిగా కెరీర్ ప్రారంభంలో అంతగా గుర్తింపు రాని లతా మంగేష్కర్.. ఆ తర్వాత 1949లో విడుదలైన ‘మహాల్’ చిత్రంలో ‘ఆయేగా ఆనేవాలా..’ పాటతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతేకాదు 1948 నుంచి 1978 వరకు అంటే మూడు దశాబ్దాల కాలంలో ముప్పై వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డును సాధించిన ఘనత లతాది. ఇండియన్ నైటింగెల్గా పేరు సంపాదించిన ఆమె తన సినీ ప్రయాణంలో 30కు పైగా భాషల్లో ఇప్పటివరకూ 50వేలకు పైగా పాటలను ఆలపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏడు దశాబ్ధాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించారు లతా.
ఇక తెలుగు సినీ పరిశ్రమతో కూడా లతా మంగేష్కర్ కూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1955లో ఏఎన్నా, సావిత్రి నటించిన సంతానం సినిమాలో నిద్దురపోరా తమ్ముడా అనే పాటను పాడారు. ఇంకా ఎన్టీఆర్-జమునల దిరికితే దొంలు సినిమలో శ్రీ వెంకటేశా అనే పాటను.. తర్వాత నాగార్జున ఆఖరి పోరాటంలో తెల్ల చీరకు.. అనే పాటను ఆలపించారు.
ఇక లతా మంగేష్కర్ సినీ ప్రయాణంలో ఎన్నోఅవార్డులను సొంతం చేసుకున్నారు. భారత గర్వించదగ్గ భారత రత్న అవార్డుతో పాటు భారత అత్యున్నత పురస్కారాలు దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు. మరి లతా మంగేష్కర్ భౌతికంగా లేకపోయినా పాట రూపంలో మాత్రం ఎప్పటికీ బ్రతికే ఉంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: