కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. రానా తో మొదలైన వివాహాల పర్వంలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కూడా ఒక ఇంటివారయ్యారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కరోనా థర్డ్ వేవ్ ప్రభావంలో సింగర్ రేవంత్ తో మళ్లీ ఆ సందడి మొదలైంది. గుంటూరులో రేవంత్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా ప్రభావం ఇంకా ఉండటంతో.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీ నుండి పలువురు గాయనీగాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు రేవంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరి చూద్దాం.. ఇయర్ ఎండింగ్ లోపు ఈ ఏడాది ఈ విహహాల లిస్ట్ లో ఎంతమంది చేరుతారో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పలు మ్యూజిక్ కాంపిటీషన్స్, టీవీ రియాల్టి షోలు ఇలా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు రేవంత్. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో పాటలు కూడా పాడాడు. ఇక వీటితో పాటు తన కెరీర్ లో సాధించిన మరో ఘనత ఇండియన్ ఐడల్ విన్నర్ అవ్వడం. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఇండియన్ ఐడల్ సీజన్ 9లో రేవంత్ పాల్గొని విన్నర్ అయి మంచి గుర్తింపు పొందాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: