మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17 న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర పరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలుకూడా అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప :ది రూల్” మూవీ లో నటించనున్నారు. అల్లు అర్జున్ ఎప్పుడు గ్యాప్ దొరికినా.. తన ఫ్యామిలీతో విలువైన సమయాన్ని స్పెండ్ చేస్తారని తెలిసిన విషయమే. తనయుడు అయాన్ , తనయ అర్హ లతో అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తారు. “పుష్ప 2 ” మూవీ షూటింగ్‌కు ఇంకా సమయం ఉండడంతో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారు.వారిద్దరి రన్నింగ్ రేస్ ను వీడియో తీసిన అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఆ వీడియో నుతన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. తమ ఇంటి లాన్ లో అర్హతో పాటు తానూ సరదాగా పరుగుపెట్టి అర్హను గెలిపించడానికి అల్లు అర్జున్ వెనుకబడడం… గెలిచిన కూతురుని ఎత్తుకొని ముద్దాడడం తో ఉన్న వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: