శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు , నాజర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మూవీ పై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్ హీరో రవితేజ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. యాక్షన్ మోడ్ లో ఉన్న రవితేజ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి మూవీ పై అంచనాలను పెంచింది. హీరో రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: