దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.”గుడ్ లక్ సఖి ” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దిల్ రాజు- రామ్ చరణ్ అభిమానుల కోసం ఎగ్జయిట్ చేసే సమాచారాన్ని అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ చరణ్ నుండి కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ మూవీస్ కోసం సిద్ధంగా ఉండండనీ , స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుందనీ , కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీని ఈ సంవత్సరం చివరి భాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనీ, ఈ రెండు చిత్రాలకు భిన్నంగా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో శంకర్ ఎస్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “RC15 ” మూవీ 2023 సంవత్సరంలో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కానుందనీ దిల్ రాజు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: