సామాన్య ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందన్న విషయం చాలా సార్లు రుజువైంది. మరోసారి అది రుజువు చేశారు. ఇటీవల భారీగా వచ్చిన వర్షాల వల్ల ఏపీ లో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి ఇప్పటికే తమకు తోచినంత సాయం చేశారు. చిరంజీవి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇంకా పలువురు సెలబ్రిటీలు సాయం అందించారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ముందుకొచ్చి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా ప్రభాస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాాగా ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే తను నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. వచ్చే ఏదాది సంక్రాతికి సందడి చేయనుంది. దీనితో పాటు ఆది పురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సలార్ కూడా దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. ఇంకా నాగ్ అశ్విన్ తో అలానే సందీప్ వంగా తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: