హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ప్రస్తుతం తాను స్పోర్ట్స్ నేపథ్యంలో చేసిన లక్ష్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా వచ్చిన పోస్టర్లు కానీ,టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూాడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బృందం ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ను ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్య పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: