ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
𝐉𝐀𝐈 𝐁𝐀𝐋𝐀𝐘𝐘𝐀 is an Universal Emotion🔥🔥 #Akhanda 🦁
Book Your Tickets🎟 https://t.co/rYIdlfkcUhhttps://t.co/AqgnupZKc5#AkhandaMassJathara#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy pic.twitter.com/YVc66GtJBF
— Dwaraka Creations (@dwarakacreation) December 6, 2021
“అఖండ” మూవీ లో జై బాలయ్య సాంగ్ లో హీరో బాలకృష్ణ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సాంగ్ తెలుగు ప్రేక్షకులతో పాటు విదేశీయులను కూడా ఆకట్టుకుంది. హీరో బాలకృష్ణ డ్యాన్స్ స్టెప్స్ ను అనుకరిస్తూ ఒక ఫారినర్ డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్ ను ద్వారకా క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































