మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ సినిమా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న విషయం కూడా విదితమే. ఇక ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయారు. దీనిలో భాగంగానే ఈసినిమాకోసం చిరు లుక్ టెస్ట్ కూడా చేయడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు మూవీ ముహూర్తం ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. అంతేకాదు ఈసినిమాలో హీరోయిన్ ను కూడా అఫీషియల్ గా ప్రకటించారు. ముందునుండి వార్తలు వస్తున్నట్టే ఈసినిమాలో తమన్నాను ఫిక్స్ చేశారు.
The Talented Actress & Dazzling Beauty @tamannaahspeaks is on Board for ..💃🏻😍
MEGA MASSIVE MOVIE ⚡💥
MEGA🌟 @KChiruTweets
& @MeherRamesh‘s🔱 #BholaaShankar 🔱
Opening Pooja🪔
on 11 – 11- 21 @ 7:45AM✨@AnilSunkara1 @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/SN4UQ71UIL— AK Entertainments (@AKentsOfficial) November 9, 2021
కాగా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈసినిమాలో చిరంజీవి కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్ కూడా చేస్తున్నాడు చిరు. గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు బాబి సినిమాను కూడా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: