లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఇండియన్2. ఈసినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ. ఎప్పుడో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లినా మధ్యలో పలు సమస్యలు తలెత్తడంతో ఆలస్యమైంది. ఫైనల్ గా అయితే సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫైనల్ గా జులై 12వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈపాట ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పారా అంటూ వచ్చే ఈపాట ప్రోమో ఆకట్టుకుంది. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
The warrior has arrived! 🔥 1st single #PAARAA from INDIAN-2 is OUT NOW! 🤩🥁 Echoing the fearless spirit and the power of an Indian. 🇮🇳💪
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics @poetpaavijay ✍🏻
Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️… pic.twitter.com/OoAkIOFKhU— Lyca Productions (@LycaProductions) May 22, 2024
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























