కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. గామి లాంటి హిట్ సినిమా తరువాత విశ్వక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ మే 31వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ ను 25వ తేదీన హైద్రాబద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న దేవి 70 ఎంఎం థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Get ready to witness an exhilarating and intense sneak-peek of our Lankala Rathna’s Gang! 🔥🔥#GangsofGodavari Grand Trailer launch Event on 25th May at Devi Theatre, RTC X Roards from 04:06pm onwards 💥💥
Mass Ka Das @VishwakSenActor’s #GOG worldwide grand release at theatres… pic.twitter.com/M3M326pibl
— Sithara Entertainments (@SitharaEnts) May 22, 2024
కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























