యంగ్ హీరో కార్తికేయ నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈసినిమా వస్తుంది.ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను నేషనల్ వైడ్ గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ‘బేబి’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘గామి’, ‘ఓం భీమ్ బుష్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సూపర్ హిట్ సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తమ టీమ్ లో జాయిన్ కావడాన్ని హ్యాపీగా అనౌన్స్ చేశారు “భజే వాయు వేగం” మేకర్స్.
కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































