రెండు నెలల గ్యాప్ రెండు బ్లాక్ బాస్టర్లను ఇచ్చాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తను హీరోగా నటించిన ఆడు జీవితం మార్చి చివర్లో వచ్చి దాదాపు 150కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెకండ్ హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు తను కీలక పాత్రలో నటించిన గురువాయూర్ అంబలనాడయిల్ అనే సినిమా కూడా అదరగొడుతుంది. గత వారంలో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈసినిమా నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విపిన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో పృథ్వీరాజ్ తో పాటు బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్ మరియు యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పృథీరాజ్ ప్రొడక్షన్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఇక ఇదిలావుంటే వరుస సక్సెస్ లతో మలయాళం ఇండస్ట్రీ కలకలలాడుతుంది. మిగితా ఇండస్ట్రీ లు సరైన సినిమాలు లేక డల్ అవుతుంటే మలయాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకోగా ప్రేమలు, ఆడు జీవితం, ఆవేశం 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ లు అయ్యాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























