మెగా కాంపౌండ్ నుండి హీరో వస్తున్నాడంటే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. సినిమా హిట్ అయిందా ఓకే లేకపోతే ఏ రేంజ్ లో కామెంట్ చేస్తారో తెలియంది కాదు. అలా ఎన్నో అంచనాల మధ్య మెగా కాంపౌండ్ నుండి వచ్చి.. మొదటి సినిమాతోనే పలు రికార్డులు క్రియేట్ చేసి ఒకరకంగా చెప్పాలంటే మెగా యంగ్ హీరోలందరి రికార్డులను చెరిపేసి సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో వెష్ణవ్ తేజ్. ఇక ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ కు ఆ తరువాత వరుస అవకాశాలు కూడా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడావైష్ణవ్ తేజ్ కమర్షియల్ హంగులకు పోకుండా కథకు, పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి క్రిష్ సినిమాతో రాబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా కొండపొలం. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ను బట్టి చెప్పొచ్చు సినిమా ఎలా ఉండబోతుందో. ఇక ఈనెల 8న ఈసినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సందర్బంగా వైష్ణవ్ తేజ్ తన ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. తాజాగా వైష్ణవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మామ పవన్ కళ్యాణ్ లాగే తాను ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదని.. డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వైపు వెళదామని అనుకున్నాను. ప్రస్తుతానికి నా కెరీర్ బాగానే సాగుతోంది.. ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోతే వేరే ఫీల్డ్ కి వెళ్లడానికి నేను ఏమాత్రం మొహమాట పడను అంటూ చెప్పుకొచ్చాడు.
కాాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: