స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమురం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30″మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇప్పుడు భీమ్ లుక్ నుండి మళ్లీ “జనతా గ్యారేజ్” చిత్రం లుక్ లోకి మారారు. ఎవరు మీలో కోటీశ్వరులు కాస్ట్యూమ్స్ లో ఇదే లుక్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోలు బయటకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే లుక్ లోకి మారడంతో బహుశా జనతా కి గాని సీక్వెల్ నా లేకపోతే మరేమన్నానా అని సందేహం కలుగుతోంది. మొత్తానికి మాత్రం ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ కొత్త ప్రశ్నలను రేకెత్తించింది.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: