మాస్ మసాల చిత్ర దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ షూటింగ్ ను హీరో బాలకృష్ణ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా #NBK107 మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు గొపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో #NBK107 మూవీ తెరకెక్కనుంది. హీరో బాలకృష్ణ థీమ్ పోస్టర్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. #NBK107 మూవీ షూటింగ్ అక్టోబర్ 1న ప్రారంభం కానుందనీ, హీరో బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో కాప్ గా నటించనున్నారనీ సమాచారం. నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: