పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పటివరకూ సెట్స్ పైకి రాలేదు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ఇన్నాళ్లకు ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రెడిషనల్ వేర్‌లో నాట్యం చేస్తున్న లుక్ ను రిలీజ్ చేశారు. ఇక నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో నిధి ‘పంచమి’ అనే క్యారెక్టర్లో కనిపించనుంది.
Beauty as ELEGANT & RADIANT as the Moon. We wish our gorgeous #PANCHAMI, @AgerwalNidhhi a very Happy Birthday! ❤️
– Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @mmkeeravaani @AMRatnamOfI @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @benlock @aishureddy82 @HHVMFilm pic.twitter.com/G7ryUKXgrO
— Mega Surya Production (@MegaSuryaProd) August 17, 2021
అంతేకాదు ఈసినిమాలో బాలీవుడ్ నుండి జాక్వలైన్, అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
Beauty as ELEGANT & RADIANT as the Moon. We wish our gorgeous #PANCHAMI, @AgerwalNidhhi a very Happy Birthday! ❤️
– Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @mmkeeravaani @AMRatnamOfI @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @benlock @aishureddy82 @HHVMFilm pic.twitter.com/G7ryUKXgrO
— Mega Surya Production (@MegaSuryaProd) August 17, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: