కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమాల షూటింగ్ లు, అలాగే రిలీజ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడే పరిస్థితులు కాస్త సాధారణ పరిస్థితికి వస్తుండటంతో థియేటర్లు ఓపెన్ చేశారు.. షూటింగ్ లు అయితే ఎప్పటినుండో మొదలు పెట్టారు. ఈనేపథ్యంలోనే పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే ప్రతి శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవారం పలు సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఆగష్ట్ 27న మాత్రం కాస్త పోటీ గట్టిగానే ఉండనుంది. ఆగష్ట్ 27న పలు సినిమాలు రిలీజ్ అవుతుండగా ఇప్పుడు ఆ రేస్ నుండి 101 జిల్లాల అందగాడు తప్పుకున్నాడు. ఈ సినిమాను ముందు ఆగస్టు 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఆరోజు చాలా సినిమాలు ఉండటంతో కాస్త వెనక్కి తగ్గి మేకర్స్ ఈసినిమాను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.
మా అందగాడు అలిగాడు 😏!
ఆరు నూరైనా, నూరు, నూటొక్కటైనా సెప్టెంబర్ 3 న #101JA FIX💥👨🦲#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @shakthikanth @DopRaamReddy @bhaskarabhatla #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel pic.twitter.com/CScgCJRKRY— Telugu FilmNagar (@telugufilmnagar) August 14, 2021
కాగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సరసన రుహనీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: