ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అది కూడా చివరి దశకు చేరుకుంది. అయితే ఈసినిమా ఆలస్యం అవ్వడానికి మాత్రం ఇంకో కారణం కూడా ఉందట. ఈసినిమాలో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈయన పాత్రకు సంబంధించి హిందీలో డబ్బింగ్ పూర్తి చేసుకున్నాడు. కానీ సౌత్ లాంగ్వేజస్ లో ఈయన పాత్రకు సరిపడా వాయిస్ ఇంకా దొరకలేదట. అన్ని పాత్రలకు సంబంధించి పూర్తి అయిపోగా సంజయ్ దత్ పాత్రకు డబ్బింగ్ మాత్రం ఇంకా అవ్వలేదట. ఇప్పుడు ఇది కూడా కె.జి.యఫ్2 రిలీజ్ లేట్ అవ్వడానికి కారణమని చెబుతున్నారు. మరి త్వరలోనే డబ్బింగ్ పూర్తిచేసి రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాలి.
కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: