“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి “కాట్రాడు తమిళ “మూవీ తో కోలీవుడ్ , “హొంగనసు “మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అంజలి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “గీతాంజలి “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్రపరిశ్రమ లో కథానాయికల మధ్య పోటీ గురించి అంజలి మాట్లాడుతూ .. కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించననీ , సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవనీ , ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తాను ఎప్పుడూ భావించుకోననీ , సినీపరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుందనీ , ఇక్కడ ఎవరికి దక్కాల్సిన సినిమాలు వారినే వరిస్తాయనీ , తన సినీ కెరీర్ లో అనుష్క, సమంతతో పాటు చాలా మంది నాయికలతో కలిసి నటించాననీ , వారిని స్నేహితులుగా భావించాను తప్పితే పోటీదారులుగా ఏనాడూ ఊహించలేదనీ , సీనియర్లతో పాటు నూతన కథానాయికల నటనను చూస్తూ తప్పుల్ని సరిదిద్దుకుంటాననీ చెప్పారు.
[subscribe]
![Video thumbnail](https://img.youtube.com/vi/0qpvQkc6BEw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/Z-0LiTGTf3Y/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/TaiY9kF3TFM/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/x1i9senmYx8/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)