పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత చాలా స్పీడు మీదున్నాడు. యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఛాన్స్ లు ఇస్తున్నాడు ఇప్పటికే తను నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ పాకెట్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరోసినిమా లైన్ లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాఉండగా గతంలో పవన్ తో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు తీసిన బండ్ల గణేష్ పవన్ తో మరో సినిమా చేస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి గుర్తుండేఉంటుంది కదా. బండ్ల ఆల్రెడీ డైరెక్టర్ ని ఫిక్స్ చేశారని.. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా వినిపించడం జరిగిందని అంటున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రాక్షసుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ. రమేష్ వర్మ పవన్ కళ్యాణ్ కి ఓ కథ వినిపించారట. స్టోరీ నచ్చడంతో పవన్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని.. పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకోమని దర్శకుడికి చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపించాయి.
ఇక ఆవార్తలపై బండ్ల స్పందిస్తూ ఈవార్తల్లో ఎలాంటి నిజం లేదని తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఏ డైరెక్టర్ ను ఫైనలైజ్ చేయలేదు.. ఒకవేళ చేస్తే అధికారికంగా ప్రకటిస్తాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు..
Wrong news Anything finalised I will announce thank you Jai @PawanKalyan star ⭐️ https://t.co/AXmG9Hcdkm
— BANDLA GANESH. (@ganeshbandla) May 18, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: