ఇండస్ట్రీ అన్నతరువాత ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్కును చూపించగలుగుతారు. అలాంటి వారిలో ఈతరం దర్శకుల్లో నాగ్ అశ్విన్ పేరు కూడా ఉంటుంది. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ అల్లుడిగా ప్రియాంక దత్ భర్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసింది తక్కువ సినిమాలే కానీ తన ఇంపాక్ట్ మాత్రం బాగానే చూపించాడు. డైరెక్టర్ గా ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు చేయగా.. నిర్మాతగా జాతి రత్నాలు తీశాడు. కానీ వేటికవే చాలా విభిన్నవైనవిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎవడే సుబ్రమణ్యం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, రితు వర్మ, షావుకారు జానకి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈసినిమాతో నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు ఇండస్ట్రీకి. ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి వైవిధ్యభరిత చిత్రంతో తాను పరిచయం అవ్వడమే కాకుండా.. ఇద్దరు నటులను స్టార్స్‌ని చేశారు. నాని కి బాగానే పేరున్న ఈసినిమా మాత్రం కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. విజయ్ దేవరకొండ కు కూడా ఈసినిమా టర్నింగ్ పాయింట్ అయింది. ఈ ఒక్క సినిమాలోనే నవ్వించాడు, ఏడిపించాడు, స్నేహం విలువ తెలిపాడు, ప్రేమకున్న బంధం ఇదని సూచించాడు. ఒక్కటేమిటి.. ఆ చిత్రంతో ఓ జీవిత సత్యాన్నే చెప్పాడు నాగ్ అశ్విన్.
ఇక ఆతరువాత వచ్చిన మరో ఆణిముత్యం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. మరి సావిత్రి లాంటి మహానటి జీవితాన్ని ఆవిష్కరించాలంటే మాములు విషయం కాదు. అది కూడా రెండో సినిమాకే ఇలాంటి ప్రయోగం అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యమే చేశాడు నాగ్ అశ్విన్. ఎక్కడా రిమార్క్ లేకుండా.. ఎటువంటి కాంట్రవర్శీలు లేకుండా.. ఆ సినిమాని పూర్తి చేయడం కేవలం నాగ్ అశ్విన్ కే సాధ్యమైంది. సావిత్రి కాలం నాటి లుక్ కోసం వారు తీసుకున్న జాగ్రత్తలు, ఎన్నుకున్న ఆర్టిస్ట్‌లు.. ఒక్కటేమిటీ ప్రతీదీ పర్ఫెక్ట్ అనేలా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రంతో కీర్తిసురేష్ మహానటిగా స్థిరపడిపోవడమే కాకుండా.. జాతీయ స్థాయి గుర్తింపును సైతం అందుకుంది. దాదాపు 29 ఏళ్ళ తరువాత కీర్తి సురేష్ కు ఈ అవార్డు దక్కింది.
ఇక మూడో సినిమాకే నిర్మాతగా మారాడు. అనుదీప్ దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ అయిపోయింది. అంతేకాదు ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు కలెక్షన్స్ కలెక్ట్ చేయలేదు. మార్చిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వగా ఈసినిమా మాత్రం వాటన్నింటిని పక్కకు నెట్టేసింది. ఈసినిమాతో నాగ్ అశ్విన్ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక నేడు నాగ్ అశ్విన్ పుట్టినరోజు. ఈసందర్భంగా నాగ్ అశ్విన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని.. ముందు ముందు గుర్తుండిపోయే మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుందాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: