జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈసినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” కడా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను తెలుగులో కూడా వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.
ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్‌లోనూ నటిస్తున్నారు.
కృతిక, ఎస్తేర్, నదియా, వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: