మన తెలుగు సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య కాలంలో అలా చాలా సినిమాలకే జరిగింది. ఇక తెలుగు సినిమాలు హిందీ లో డబ్బింగ్ అయి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా మిలియన్ వ్యూస్ తోదూసుకుపోతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమా 100 మిలియన్స్ ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా డీజే (దువ్వాడ జగన్నాథమ్)’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్న అల్లు అర్జున్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. 2017 జూన్ 23న విడుదలైన ఈసినిమా తెలుగు వర్షెన్‌కు యూట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా తెలియచేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
100 MILLION VIEWS for Icon Staar @alluarjun & Blockbuster Director @harish2you’s Biggest Super Hit “DJ #DuvvadaJagannadham” Telugu Movie on @YouTubeIndia 💥✨#100MillionForDJMovieInTelugu 🔥
DJ Full Movie – https://t.co/TSRUASh59s@hegdepooja @ThisIsDSP @SVC_official #DilRaju pic.twitter.com/HVDC3hqHJ7
— Sri Venkateswara Creations (@SVC_official) April 23, 2021
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: