రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర పై ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ విప్లవాత్మక నాయకులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలకు గురువుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయన స్ఫూర్తి తోనే వీరిద్దరూ విప్లవానికి దిగుతారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది. ఇంకా అజయ్ దేవగన్ పదిరోజుల షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే ఆ షూట్ ను కూడా పూర్తి చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ కరోనా లేకపోతే ఈ పాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకునేది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేవాడు. ఇక ప్రస్తుతం ట్రయిల్ షూట్ పనుల్లో బిజీ గా వున్నాడు రాజమౌళి.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. మరి హీరోలు ఇద్దరూ ఇక్కడే వున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. కానీ హీరోయిన్ లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి షూటింగ్ లో పాల్గొనాలంటే కష్టం. మరి వారికోసం వెయిట్ చేయాలంటే ఎలా లేదనుకున్నా రెండు మూడు నెలలు అయినా పడుతుంది. ఒలివియా మోరిస్ అయితే వచ్చే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. మరి రాజమౌళి ఎం చేస్తాడో చూడాలి.
ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: