నాగార్జున స్వీట్ మెమొరీ

Akkineni Nagarjuna Shares A Throwback Family Photo From Their Spain Holiday

బాక్స్ ఆఫీస్ హిట్ “విక్రమ్”(1986 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా అనేక సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరో గా నటించి, నిర్మించిన “నిన్నే పెళ్ళాడతా ” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. బ్లాక్ బస్టర్ “అన్నమయ్య “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ స్వంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగార్జున ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” హిందీ , “వైల్డ్ డాగ్ “తెలుగు మూవీ లో నటిస్తున్నారు. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో నాగార్జున నటించనున్నారు. హీరో నాగార్జున తన 60 వ పుట్టిన రోజు ను తన కుటుంబ సభ్యులతో స్పెయిన్ దేశంలో జరుపుకున్నారు. ఆ సందర్భంలో తీసిన ఫొటో లో నాగార్జున తోపాటు అమల , నాగచైతన్య , సమంత , అఖిల్ ఉన్నారు. పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఫొటో గా ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు కురిపించారు. ఆ ఫోటో నాగార్జున జీవితంలో ఒక స్వీట్ మెమొరీ గా నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =