సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే మన డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల శివ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు రెడీ అయినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ కూడా వీరి రూట్ లోకే వచ్చినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. హరీష్ శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ కూడా నిర్మాతగా మారుతున్నట్టువార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసుతో కలిసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతోనే హరీష్ శంకర్ నిర్మాతగా మారుతున్నాడట. కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ హీరోతో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమా సక్సెస్ అయితే భవిష్యత్తులో తన శిష్యులతో మరిన్ని సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే.




ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే మరో ఛాన్స్ కొట్టేసాడు హరీశ్ శంకర్. ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం తర్వాత 14 రీల్స్ సంస్థలో మరో సినిమా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: