‘సింహా’, ‘లెజెండ్’.. ఇలా నటసింహ బాలకృష్ణ మాస్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. విశేషంగా ఈ రెండు సినిమాలు కూడా ఆ యా సంవత్సరాల్లో సమ్మర్ సీజన్‌లోనే సందడి చేశాయి. కట్ చేస్తే.. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న తదుపరి చిత్రం మాత్రం అందుకు భిన్నంగా మరో సీజన్‌లో వినోదాలు పంచనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బాలకృష్ణ, బోయపాటి థర్డ్ జాయింట్ వెంచర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలిదశ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మలిదశ చిత్రీకరణకు సన్నద్ధం అవుతున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాని దసరాకి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారట బోయపాటి అండ్ టీమ్. అంతేకాకుండా ఇందులో బాలయ్యకి జోడిగా నూతన కథానాయికను ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి.. దసరాకి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందిస్తుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: