లాక్ డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. 24 గంటలు ఇంట్లోనే ఉండాలి. అయితే కొంత మందికి మాత్రం ఇది కాస్త ఇబ్బందైన విషయమే. ముఖ్యంగా సెలెబ్రిటీస్. వీళ్ళకి సినిమాలు ఉంటే క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంటారు. కానీ షూటింగ్ లు ఎక్కడికక్కడ బంద్ అవ్వడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ టైంను కూడా వాళ్ళు బాగానే ఉంపయోగించుకుంటున్నారు. కుకింగ్, వర్క్ ఔట్స్, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ ఇలా ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అందుబాటులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా తనలో ఉన్న టాలెంట్స్ ను బయట పెడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే కొన్ని రోజుల క్రిందట ప్రగతి ఫిట్నెస్ కోసం వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియో ను పోస్ట్ చేసింది. అయితే దానిపై పలు విమర్శలు తలెత్తాయనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఆ కామెంట్స్ ఏ మాత్రం పట్టించుకోకుండా మరో డ్యాన్స్ వీడియో ను పోస్ట్ చేసింది. అయితే అలాంటి ఇలాంటి డ్యాన్స్ కాదు… మాస్ డ్యాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. త్వరలోనే విడుదల కానున్న విజయ్ సినిమా మాస్టర్ సినిమాలోని పాటకు మాస్ స్టెప్స్ వేసి సినిమాల్లో ట్రెడిషనల్ గా అమ్మ, వదిన పాత్రలు చేసే ప్రగతి యేనా ఈమె అని ఆలోచించుకునేలా వేసింది. ప్రగతి చేసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
View this post on Instagram
Quarantine tales #vaathicoming #mothersonduo #master💕❤🤪🤪 HAPPY EASTER🤩😍🤩
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: