అనసూయ… గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించి… ఆపై వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘క్షణం’, ‘గాయత్రి’ సినిమాలతో నటిగా నిరూపించుకున్నా… మెగా కాంపౌండ్ మూవీస్‌తోనే ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది ఈ `జబర్దస్త్` సెన్సేషన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలుత `సుప్రీమ్` హీరో సాయి తేజ్ నటించిన ‘విన్నర్’లో ఐటమ్ సాంగ్‌లో నర్తించిన అనసూయ… ఆపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది. అలాగే… విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్ 2’లోనూ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అను. ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న అనసూయ… ఇప్పుడు ఏకంగా మూడు మెగా ఆఫర్లను చేజిక్కించుకున్నట్టు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో అనసూయ ఓ ప్రత్యేక గీతంలో మెరవనుందనే మాట వినిపిస్తోంది. అంతేకాదు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో రానున్న సినిమాతో పాటు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటించే అవకాశాల్ని అనసూయ దక్కించుకుందని టాలీవుడ్ టాక్. మొత్తమ్మీద… తనకు అచ్చొచ్చిన కాంపౌండ్ లో అనసూయ వరుస సినిమాలు చేస్తుండడం విశేషమనే చెప్పాలి. త్వరలోనే ఆయా చిత్రాల్లో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: