నాగార్జున, కార్తి `ఊపిరి`కి నాలుగేళ్ళు

4 Years For Memorable Hit Oopiri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Oopiri,Oopiri Movie,Oopiri Telugu Movie,Oopiri Movie Updates,Oopiri Telugu Movie Latest News,Oopiri Movie Completed 4 Years,4 Years For Oopiri Telugu Movie,Nagarjuna,Karthi

కింగ్ నాగార్జున ప‌లు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌లో న‌టించారు. వాటిలో `ఊపిరి` ఒక‌టి. ఇందులో వీల్ ఛైర్ కే ప‌రిమిత‌మైన విక్ర‌మాదిత్య పాత్ర‌లో నాగ్ అభిన‌యం అద్వితీయం. కేవ‌లం ముఖ‌క‌వ‌ళిక‌ల‌తోనే పాత్ర‌ను ర‌క్తిక‌ట్టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారాయ‌న‌. ఇక నాగ్ కేర్ టేక‌ర్ శ్రీ‌ను పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ కార్తి న‌ట‌న కూడా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌మ‌న్నా, ప్ర‌కాష్ రాజ్, జ‌య‌సుధ ఇత‌ర ముఖ్య భూమికలు పోషించగా… అనుష్క, శ్రియ‌ అతిథి పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్‌ట‌చ్‌బుల్స్’కు రీమేక్‌గా ‘ఊపిరి’ని తెర‌కెక్కించారు దర్శకుడు వంశీ పైడిప‌ల్లి.

‘సిరివెన్నెల’ సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి గీత ర‌చ‌న‌కు గోపీసుంద‌ర్ ఆక‌ట్టుకునే బాణీలు అందించారు. ముఖ్యంగా సంద‌ర్భోచితంగా సాగే “నీవేమిచ్చావో”, “ఒక లైఫ్” వంటి పాట‌లు హృద‌యాల‌ను తాకుతాయి. పీవీపీ సినిమా సంస్థ‌ నిర్మించిన ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను త‌మిళంలో `తోళా` పేరుతో విడుద‌ల చేశారు. 2016 మార్చి 25న విడుద‌లై ప్ర‌జాదరణ పొందిన `ఊపిరి`… నేటితో నాలుగు వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 13 =