`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`… ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా, తన తదుపరి చిత్రాన్ని `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ కాంబినేషన్‌లో చేయబోతున్నట్టు సమాచారం. జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. కాగా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉందట పరశురామ్ అండ్ టీమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘మిస్ ఇండియా’, ‘రంగ్‌దే’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలతో.. తమిళంలో ‘పెంగ్విన్’, ‘అణ్ణాత్తే’ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఆమె నటించిన మలయాళ చిత్రం `మరక్కార్` విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే `మహేష్ 27`లో కీర్తి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
జూలై నుంచి పట్టాలెక్కనున్న `మహేష్ 27`ని… 2021 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























