బ్లాక్ బస్టర్ మూవీ `రంగస్థలం`లో జంటగా నటించి మెప్పించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ బ్యూటీ సమంత. అందులో చిట్టిబాబు, రామలక్ష్మిగా ఇద్దరూ పోటాపోటీగా నటించారు. కట్ చేస్తే.. రెండేళ్ళ తరువాత ఈ ఇద్దరూ మరోమారు జట్టుకట్టనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో చరణ్ నటిస్తాడని కొన్నాళ్ళుగా కథనాలు వస్తున్నాయి. దాదాపు 40 నిమిషాల పాటు సాగే ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.
[custom_ad]




కాగా, ఈ సినిమా కోసమే సామ్ మరోసారి రామ్ (చరణ్)తో జోడీకట్టనుందట. ఇదివరకు ఈ పాత్ర కోసం కియారా అద్వాని పేరు వినిపించినా, బాలీవుడ్ ప్రాజెక్టులతో తను బిజీగా ఉండడంతో ఇప్పుడా అవకాశం సామ్ కి దక్కిందట. అన్నట్టు… కొరటాల శివ దర్శకత్వంలోనూ `జనతా గ్యారేజ్` చిత్రంలో సమంత నాయికగా నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే `మెగాస్టార్ 152`లో చెర్రీ, సామ్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: