నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తో పాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ వున్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్ డేట్ ను రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తున్నామని తెలిపింది చిత్రయూనిట్.
కాగా కీరవాణి తనయుడు బాహుబలి2, అరవింద సమేత మూవీస్ హిట్ సాంగ్స్ పాడిన కాలభైరవ మత్తువదలరా మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ .. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి కీరవాణి కొడుకులు హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతారో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: