‘వెంకీమామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Venky Mama Pre Release Event Date Locked

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న రిలీజ్ డేట్ లో కూడా క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తేదీ, వేదిక ఖరారైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘వెంకీమామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 7న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు సరసన రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =