కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బోయపాటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చే ఇప్పశాడు బాలకృష్ణ కోసం. ఇక తాజా సమాచారం ఈ సినిమాను రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సినిమా టైటిల్ ను కూడా రేపే ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
మరి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ అవ్వగా.. ఇపుడు హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నారు. చూద్దాం మరి హ్యాట్రిక్ కొడతారేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: