సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా పండగలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో అలరించిన రజినీ… తన తదుపరి చిత్రాలను వచ్చే ఏడాది సంక్రాంతి, దీపావళికి టార్గెట్ చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… రజినీకాంత్ కథానాయకుడిగా పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ ‘దర్బార్’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది.
కాగా… ఈ సినిమా పూర్తయ్యేలోపు `శౌర్యం` శివ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించనున్నారట రజినీ. కోలీవుడ్ స్టార్ అజిత్‌తో ‘వీరమ్’,‘వేదాలమ్’, `వివేగమ్’, `విశ్వాసమ్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ… ప్రస్తుతం సూర్య హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదయ్యాక రజినీ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళుతుందట. కాగా… ఈ సినిమాని 2020 దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరి… పండగలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సూపర్ స్టార్… రానున్న చిత్రాలతో తన స్థాయి విజయాలను అందుకుంటారేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: