త‌క్కువ గ్యాప్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప‌ల‌క‌రించ‌నున్న సుదీప్‌

2019 Latest Telugu Film News, Kiccha Sudeep Coming Up with Interesting Projects, Kiccha Sudeep Latest Movie News, Interesting Projects by Kiccha Sudeep, Kiccha Sudeep busy With Interesting Projects, Kiccha Sudeep Ropped An Interesting Role, Kiccha Sudeep Upcoming Projects Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’(2012)తో ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్. తొలి అడుగులోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైన‌ ఈ శాండల్‌వుడ్ హీరో… ఆపై ‘బాహుబలి: ది బిగినింగ్’లోనూ తళుక్కున మెరిసాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ‘ప‌హిల్వాన్’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘మరక్కర్: అరబికడ‌లింటే సింహం’, ‘దబాంగ్ 3’ వంటి నాలుగు వేర్వేరు భాషలకు చెందిన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు సుదీప్‌. అంతేకాదు… వీటిలో మూడు చిత్రాలు త‌క్కువ గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… సుదీప్ బాక్సర్‌గాను, మల్లయోధుడుగాను ద్విపాత్రాభినయం పోషించిన కన్నడ చిత్రం ‘ప‌హిల్వాన్’. ఎస్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… సెప్టెంబర్ 12న ప‌లు భాష‌ల్లో విడుదల కానుంది. అలాగే… మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన పేట్రియాట్రిక్ డ్రామా ‘సైరా నరసింహారెడ్డి’లో “అవుకు రాజు”గా దర్శనమివ్వనున్నాడు సుదీప్‌. మ‌హాత్మ గాంధీ 150వ‌ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుందీ సినిమా. మ‌రోవైపు… సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ మూవీ ‘దబాంగ్ 3’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు సుదీప్. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ధియేటర్లలో సందడి చేయనుంది.

మొత్తానికి… నాలుగు నెల‌ల గ్యాప్‌లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో సుదీప్ ఏ స్థాయిలో అల‌రిస్తాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =