‘కింగ్’ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మన్మథుడు’(2002)కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా…. ప్రస్తుతం పోర్చుగల్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో నాగార్జున, రకుల్, ‘వెన్నెల’ కిషోర్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.ఇదిలా ఉంటే… ‘మన్మథుడు2’ కోసం రకుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… ఆ మధ్య ‘దే దే ప్యార్ దే’ అనే హిందీ చిత్రం కోసం దాదాపు 10 కిలోల బరువు తగ్గింది రకుల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అకివ్ అలీ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఆ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించాడు. కాగా… దర్శకుడి సూచన మేరకు 25 రోజుల వ్యవధిలో ప్రతీరోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక వ్యాయామాలు చేసి మరీ 10 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచింది రకుల్. కట్ చేస్తే… ఇప్పుడు నాగ్‌తో నటిస్తున్న ‘మన్మథుడు 2’ కోసం కొంత బరువు పెరగాల్సిందిగా దర్శకుడు రాహుల్ సూచించడంతో… మళ్ళీ బరువు పెరిగే పనిలో ఉందట రకుల్. మొత్తమ్మీద తన డెడికేషన్‌తో రకుల్ … దర్శకుల అభిమానాన్ని చూరగుంటోంది. కాగా… మన్మథుడు 2
సినిమాను జూలైలోగా పూర్తి చేసి… ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
[subscribe]
[youtube_video videoid=rdma778BpC0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: