కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘చిత్రలహరి’. ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ సినిమాతో తేజ్ కు హిట్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాడు. ఇప్పుడు తాజాగా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది ‘చిత్రలహరి’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాతో అయినా సాయి తేజ్ కు మంచి సక్సెస్ అందుతుందో? లేదో? చూద్దాం..
[youtube_video videoid=YQ7R0tjbpcM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: