`లీడర్` (2010) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ… తెలుగునాట అంతగా రాణించలేకపోయింది ఈ అమ్మడు. అయితే… తమిళంలో మాత్రం ప్రియకి మంచి అవకాశాలే దక్కాయి. అలాగే హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ హిట్ చిత్రాల్లో సందడి చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీకి మరో ఇంట్రెస్టింగ్ తమిళ్ ప్రాజెక్ట్‌లో ఆఫర్ వచ్చింది. అయితే… హీరోయిన్‌గా కాదు.. ఓ కీ రోల్ కోసం. ఆ సినిమానే… `అర్జున్ రెడ్డి` రీమేక్‌గా తెరకెక్కుతున్న `ఆదిత్య వర్మ`. విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో… ప్రియా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… విక్రమ్ హీరోగా నటించిన `ఇరుముగన్` (తెలుగులో `ఇంకొక్కడు`) చిత్రంలో నిత్యా మీనన్ పాత్రకి ముందుగా ప్రియా ఆనంద్‌నే అప్పట్లో ఎంపిక చేసుకున్నారు. అయితే నిర్మాణంలో చోటుచేసుకున్న జాప్యం కారణంగా… కాల్షీట్ల సమస్యతో అప్పట్లో ఆ అవకాశం మిస్ అయ్యింది ప్రియ. అయితే… ఇప్పుడు మాత్రం విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో కలసి నటించే అవకాశం దక్కించుకుంది. మరి… ధ్రువ్‌కి ప్రియ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
[youtube_video videoid=EVrgWqwbdIE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: